విజయం వరించాలంటే.. భావోద్వేగాలను అధిగమించాలి. ఒత్తిడిని నియంత్రించుకోవడం తెలియాలి. అప్పుడే మానసికాందోళనలను దూరం చేసుకోగలుగుతారని సైకలాజిస్టులు సూచిస్తున్నారు. ఎప్పుడైనా, ఎక్కడైనా నెగ్గాలంటే కేవలం ప్రతిభ మాత్రం ఉంటే సరిపోదు. భావోద్వేగాలను అధికమించడం పట్ల కూడా అవగాహన ఉండాలి.
కష్టాలొచ్చినప్పుడు వాటిని గుర్తుచేసుకొని మెుండిగా ముందుకెళ్లే స్ఫూర్తినీ, పరిణతినీ అందిస్తాయి. సమస్యలు, ఇబ్బందులు వున్నప్పుడు.. ఒంటరిగా గాకుండా అందరితో కలిసిపోవాలి.
ఇతరులతో అంటే సానుకూల ఆలోచన కలిగి వారితో ఎక్కువగా మాట్లాడాలి. మనసుకు దగ్గరైన వారితో ఆలోచనల్ని పంచుకోవడం, సలహాలు తీసుకోవడం చేయాలి. అప్పుడే స్పష్టత వస్తుంది. దీనితో పాటూ యోగా, ధ్యానం వంటివీ భావోద్వేగాలను అదుపులో ఉంచడానికి తోడ్పడతాయి.