అలా చేస్తున్నారని గడియారాన్ని తీసేస్తే ఈమధ్య సెల్ ఫోను పక్కన పెట్టుకుని అందులో టైమ్ చూస్తున్నారు. అదేమని అడిగితే రేపు ఉదయం త్వరగా వెళ్లాలి అని సమాధానమిస్తున్నారు. నాకంటే అదేమీ ముఖ్యం కాదని అంటే... డబ్బు లేకపోతే ఎలా బతుకుతారు. సరే మానేసి ఇంట్లో కూచునేదా అని మండిపడతారు. ఈయనతో ఎలా చేయాలో అర్థం కావడంలేదు.
మీ వారు చేసేది తప్పే. ఉద్యోగం ఎంత ముఖ్యమో భార్యా పిల్లలకు టైమ్ కేటాయించడం కూడా అంతే ముఖ్యం. మరీ రాత్రిపూట శృంగారం చేసేటపుడు కూడా సమయాన్ని చూసుకుంటూ హడావుడిగా చేయడం చికాకునే తెప్పిస్తుంది. ఆయనకు ఎలాగో మెల్లగా నచ్చచెప్పే ప్రయత్నం చేయండి. మీకు అసంతృప్తిగా ఉన్నట్లు తెలియజేయండి. అప్పటికీ తన పద్ధతి మార్చుకోనట్లయితే మానసిక నిపుణులను సంప్రదిస్తే తగు పరిష్కారం చెప్తారు.