భగవద్గీత అసమర్థులకా? ఈ సమాజంలో అహంకారమూర్తులు ఇలా అంటారు... ' అయ్యా, నా తెలివితేటలున్నంతవరకూ నాకు దేవుడూ అక్కర్లేదు, దయ్యం అక్కర్లేదు. నేను ఎవరి మీద ఆధారపడదలచుకోలేదు. నా కాళ్ల మీద నేను నిలబడదలిచాను. నేనెప్పుడూ సమర్థత లేకుండా ఏ పనులు చేయను.
ఎలా అవతల వాళ్లని పడగొట్టాలో, అలాగే డబ్బు ఎలా సంపాదించాలో నాకు బాగా తెలుసు. నా మీద నాకు విశ్వాసముంది. మీ భగవద్గీతలూ, బ్రహ్మపురాణాలు తెలివితేటలు లేనివారికి కావాలి కానీ నాకెందుకండీ అని. తెలివితేటలు కలవాడు మాట్లాడే మాటలేనా? ఇవి. అసమర్థులకంటే సమర్థులకే భగవద్గీత కావాలి. దేనికీ? మంచి పనులు ఇంకా సమర్థతతో చేయడానికి. అసమర్థులేం చేసుకుంటారు భగవద్దీతని చెప్పండి.