4. నాయనా.. మృత్యువు అనివార్యమైనపుడు, రాళ్లు రప్పల్లాగా ఉండటం కంటే ధీరుల్లాగా మరణించటం శ్రేయస్కరం కాదా.. ఈ అశాశ్వతమైన ప్రపంచంలో ఇంకా ఒకటి రెండు రోజులు ఎక్కువ బ్రతికి ప్రయోజనమేముంది. తుప్పు పట్టేకంటే, ఈషణ్మాత్రమైనా పరులకు మేలు చేయటంలో అరిగిపోవటం మంచిది.
5. కోరికలన్నింటిని విడనాడి, సుఖభోగాలను త్యజించిన విశాల హృదయులైన స్త్రీపురుషులు వందలకొద్దీ ముందుకు వచ్చి పేదరికం, అజ్ఞానం అనే సుడిగుండంలో పడి నానాటికీ కృంగి, కృశించి, అణగారిపోతున్న లక్షలాది స్వదేశీయుల సంక్షేమ నిమిత్తం, అపరిమితమైన ఆ కాంక్షతో, తమ సర్వశక్తిని ధారపోసి, కష్టించి పని చేస్తేనే భారతజాతి జాగృతం కాగలదు.