తిరుమలలో మోస్తరు రద్దీ కొనసాగుతోంది. గురువారం ఉదయం సర్వదర్శనం కోసం 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 12 గంటల సమయం పడుతోంది. అలాగే కాలినడక భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 8 గంటల సమయం పడుతోంది. గదులతో పాటు తలనీలాల వద్ద భక్తుల రద్దీ తక్కువగానే కనిపిస్తోంది. నిన్న శ్రీవారిని 77,906 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 3 కోట్ల 3లక్షల రూపాయలు లభించింది.