జాతీయ క్రీడల్లో తమిళనాడుకు చెందిన పురుషుల వాలీబాల్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. పురుషుల వాలీబాల్ ఫైనల్స్‌లో తమిళనాడు పురుషుల జట్టు కేరళను మట్టికరిపించి, పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ తొలి సెట్‌ను 19-25 పాయింట్ల తేడాతో కోల్పోయిన తమిళనాడు, తర్వాత పుంజుకుని మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది.
తద్వారా మిగిలిన మూడు సెట్లలో 25- 22, 25- 19, 25- 19 పాయింట్ల తేడాతో కేరళ జట్టును మట్టిరిపించింది. అలాగే ఉత్తరాఖండ్ జట్టును ఓడించిన హర్యానా పురుషుల జట్టు రజత పతకాన్ని సొంతం చేసుకుంది.
కాగా, జాతీయ క్రీడల్లో కేరళ మహిళల వాలీబాల్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. పశ్చిమ బెంగాల్‌తో జరిగిన ఫైనల్ పోరులో కేరళ 25-16 25-21 21-11 పాయింట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.