గ్రాండ్‌స్లామ్‌లో రఫెల్ నాదల్ డబుల్ సెంచరీ: నోవాక్ జకోవిచ్ @ 50

శుక్రవారం, 27 మే 2016 (13:20 IST)
ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ రికార్డ్ సాధించాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో నాలుగో సీడ్ రఫెల్ నాదల్ 6-3, 6-0, 6-3తో ఫకుండో బాగ్నిస్‌ (అర్జెంటినా)పై గెలుపును నమోదు చేసుకున్నాడు. తద్వారా తన టెన్నిస్ కెరీర్‌లో 200 గ్రాండ్ స్లామ్ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. తద్వారా ఈ ఫీట్‌ సాధించిన ఎనిమిదో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. రోజర్‌ ఫెదరర్‌ మొత్తంగా 302 గ్రాండ్‌స్లామ్‌ గెలుపులతో అగ్రస్థానంలో ఉన్నాడు. 
 
అలాగే టాప్ సీడ్ నోవాక్ జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో 50వ మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో బెల్జియం క్రీడాకారుడు స్టీవ్ డార్సిస్‌పై 7-5, 6-3, 6-4తో గెలుపొందడం ద్వారా నోవాక్‌ ఈ ఫీట్‌ సాధించాడు. ఇక మహిళల సింగిల్స‌లో అమెరికా నల్లకలువ సెరెనా 6-2, 6-1తో టెలియారా పెరీరా (బ్రెజిల్‌)పై సునాయాసంగా గెలుపొందింది. ఇక మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సానియా మీర్జా, లియాండర్‌ పేస్‌ జోడీలు ప్రీక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాయి.

వెబ్దునియా పై చదవండి