ప్రపంచ అథ్లెట్స్ : ఫైనల్లో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా

శుక్రవారం, 22 జులై 2022 (09:30 IST)
ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా ఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వాలిఫికేషన్​రౌండ్‌ తొలి ప్రయత్నంలోనే 88.39 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు చేరుకున్నాడు. 
 
ఇటీవలే స్టాక్‌హోమ్‌లో జరిగిన డైమండ్‌ లీగ్‌లో 89.94 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి కొత్త జాతీయ రికార్డు సృష్టించిన విషయం తెల్సిందే. అయితే 90 మీటర్ల దూరానికి కేవలం 6 సెంటీ మీటర్ల దూరంలో నిలిచిపోయాడు. ప్రపంచ అథ్లెటిక్స్‌ ఫైనల్‌లో నీరజ్‌ ఎంత దూరం వరకు జావెలిన్‌ను విసురుతాడనేది ఆసక్తికరంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు