దుబాయ్ వేదికగా ఫిఫా సాకర్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబరు 18వ తేదీ వరకు ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మెగా సాకర్ పోటీలకు యూఏఈ దేశాల్లో ఒకటైన ఖతార్ ఆతిథ్యమిస్తుంది. ఈ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో ఆీతిథ్య ఖతార్, ఈక్వెడార్ జట్లు తలపడతాయి.
కాగా, తొలి మ్యాచ్‌కు ముందు భారీ స్థాయిలో ప్రారంభోత్సవ వేడుకలను నిర్వహిస్తారు. ఓపెనింగ్ వేడుకల్లో ప్రముఖ సంగీత బృందం బీటీఎస్‌కు చెందిన జంగ్ కూక్ ప్రదర్శన ఉంటుంది. ఈ ప్రారంభ వేడుకలకు దోహా సమీపంలోని బేత్ స్టేడియం వేదికకానుంది.