ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్ పోటీల్లో భారత క్రీడాకారులు రాణించకపోవడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో, రియోలో విఫలమవుతున్న భారత క్రీడాకారులపై ప్రముఖ కాలమిస్ట్, నవలా రచయిత్రి శోభా డే తన ట్విట్టర్ ఖాతా ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒలింపిక్స్‌కు వెళ్లే భారత క్రీడాకారులు పెద్దగా రాణించట్లేదని, భారత క్రీడాకారులు రియోకు వెళ్లడం, సెల్ఫీలు దిగడం.. వట్టి చేతులతో తిరిగిరావడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు.
రియో ద్వారా క్రీడాకారులకు ఇచ్చిన అవకాశం, వెచ్చించిన డబ్బంతా వృదా అంటూ ధ్వజమెత్తారు. అయితే శోభా డే వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంకా కాను ఏ తప్పు చేయలేదని అందుకు క్షమాపణలు కూడా చెప్పే ప్రసక్తే లేదని శోభా డే స్పష్టం చేసింది.