మళ్లీ ఇన్నాళ్లకు టోక్యో ఒలింపిక్స్లో పునర్ వైభవాన్ని గుర్తు చేస్తూ మేటి జట్లను మట్టి కరిపించి సెమీఫైనల్ చేరింది. సెమీఫైనల్లో భారత జట్టు బెల్జియంతో తలపడనుంది. 1980 ఒలింపిక్స్లో భారత్ పసిడి నెగ్గినా, ఆ ఈవెంట్లో సెమీఫైనల్ దశ లేదు.
టోర్నీ మొత్తం నిలకడగా రాణిస్తున్న భారత హాకీ టీమ్.. లీగ్ స్టేజ్లో 5 మ్యాచ్లకుగాను 4 గెలిచిన విషయం తెలిసిందే. జట్టు తరపున దిల్ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, గుర్జిత్ సింగ్ గోల్స్ చేశారు.