న్యూజిలాండ్ పర్యటన ధోనీకి అగ్ని పరీక్షే

శనివారం, 21 ఫిబ్రవరి 2009 (12:19 IST)
న్యూజిలాండ్ పర్యటన భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అగ్ని పరీక్షలాంటిదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఈ పర్యటన ధోనీ నాయకత్వ పటిమను, అతని తీరును ప్రస్ఫుటిస్తుందని వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్ వికెట్లపై భారత జట్టు ప్రాక్టీసు మ్యాచ్‌లు ఆడకపోవడం చేత... ధోనీ పెద్ద సవాలును ఎదుర్కోనున్నాడని విశ్లేషించాడు.

ముంబైలో విలేకరులతో ధోనీ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ధోనీ నేతృత్వంలోని భారత జట్టు ఉపఖండంలో మాత్రమే ఎక్కువగా ఆడిందన్నాడు. న్యూజిలాండ్ పిచ్‌లపై చాలా అనుభవం కావాలన్నాడు. కానీ వన్డేల్లో ఆస్ట్రేలియాను కిందకు నెట్టి భారత్‌ను ముందుంచడంలో ధోనీ చక్కటి సామర్థ్యాన్ని కనబరిచాడన్నాడు.

న్యూజిలాండ్‌తో సహా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలోను వార్మ్ అప్ మ్యాచ్‌ల్లో ముందస్తుగా పాల్గొనకపోతే ఆ దేశాల్లో పర్యటనలు కాస్తంత క్లిష్టంగానే ఉంటాయని తెలిపాడు. కాగా, ఈ ఎడమచేతి వాటం బ్యాట్సమెన్ నేతృత్వంలోని భారత జట్టు... 2002లో న్యూజిలాండ్‌లో పర్యటించింది. ఈ పర్యటనలో తనకెదురైన అనుభవాలను బట్టి గంగూలీ ఈ విధంగా విశ్లేషించాడు.

వెబ్దునియా పై చదవండి