వన్డే ప్రపంచకప్: గాయంతో నాథన్ హారిడ్జ్ అవుట్!?

ఆస్ట్రేలియా ఆఫ్-స్పిన్నర్ నాథన్ హారిడ్జ్ వన్డే ప్రపంచకప్‌ నుంచి తప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత ఉపఖండంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఆడే ఆసీస్ జట్టును ఈ వారంలోనే ప్రకటించిన నేపథ్యంలో, భుజంలో ఏర్పడిన గాయం కారణంగా నాథన్ హారిడ్జ్ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో ఆడటం అనుమానమేనని తెలుస్తోంది.

మంగళవారం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటింటిన 15 మంది సభ్యులతో కూడిన జట్టులో హారిడ్జ్ స్థానం దక్కించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో ఆడుతున్న హారిడ్జ్‌కు ఫీల్డింగ్ సమయంలో కుడిచేతి భుజంలో బంతి తగిలి గాయం ఏర్పడింది. దీంతో నాథన్ వైద్యుల సూచన మేరకు ఎక్స్-రే కూడా తీయడం జరిగింది.

అయితే గాయం తీవ్రత కాస్త ఎక్కువగానే ఉందని, తద్వారా హారిడ్జ్ వన్డే ప్రపంచకప్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయని తెలిసింది. కాగా ఫిబ్రవరి 19న భారత ఉపఖండంలో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి