శ్రీలంక జట్టును కిడ్నాప్ చేసేందుకు కుట్ర: లష్కరే జాంగ్వీ

పాకిస్థాన్‌లో పర్యటించిన శ్రీలంక క్రికెట్ సభ్యులను కిడ్నాప్ చేసి, జైళ్లలోని మా వాళ్లని రక్షించే దిశగా ప్రయత్నించామని లష్కరే-ఇ-జాంగ్వీ ఉగ్రవాద సంస్థకు చెందిన అబ్ధుల్ వహాబ్ ఉమర్ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. ప్రస్తుతం పాకిస్థాన్ పోలీసులు అరెస్టుచేసి జైళ్లలో ఉన్న వహాబ్ జాంగ్వి, పాకిస్థాన్‌కు చెందిన జియో టీవీకి ఇచ్చిన భేటీలో ఈ విధంగా తెలిపినట్లు పీటీఐ సంస్థ తెలిపింది.

"శ్రీలంక క్రికెట్ సభ్యులను వజీరిస్థాన్‌‌లో కిడ్నాప్ చేయాలని వూహ్యం రచించాం. ఇందుకోసం నేను లష్కరే జాంగ్వికి చెందిన అజ్మత్ ఫరూక్‌కు చెందిన బృందంతో కలిపి 12 మంది రంగంలోకి దిగాం. నేను శ్రీలంక క్రికెటర్లు కిడ్నాప్ చేయాలని, అటుపిమ్మట మా సంస్థకు చెందిన నాయకులు, జైళ్లో ఉన్న మా సంస్థకు చెందిన మరికొందరిని విడిపించేందుకు లంక క్రికెటర్లను ఆయుధాలుగా ఉపయోగించాలనుకున్నాం" అని వహాబ్ జాంగ్వి చెప్పినట్లు పీటీఐ వెల్లడించింది.

కాగా, 2009లో లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన కాల్పులకు టైగర్లు కారణమని శ్రీలంక ప్రభుత్వం ఆరోపించడం గమనార్హం. కానీ శ్రీలంక ప్రభుత్వం చేసిన ఆరోపణలను అప్పట్లోనే పాకిస్థాన్ ప్రభుత్వం కొట్టిపారేసింది.

వెబ్దునియా పై చదవండి