ప్రపంచకప్‌లో సమిష్టిగా రాణించాల్సి వుంది: కెప్టెన్ ధోనీ

భారత ఉపఖండంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు సమిష్టిగా రాణించాల్సిన అవసరం ఉందని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆటగాళ్లకు హితవు పలికాడు. బౌలింగ్ విభాగంలో గతంతో పోలిస్తే మెరుగైంది. కానీ బ్యాటింగ్ తీరు మాత్రం బాగుపడాల్సిన అవసరం ఉందని ధోనీ వ్యాఖ్యానించాడు.

యువ ఆటగాడు విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా జరిగిన సిరీస్‌లో అద్భుతంగా రాణించిన యూసుఫ్ పఠాన్‌లపై తనకు ఎంతో నమ్మకం ఉందన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉన్న వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ వంటి మేటి ఆటగాళ్లు జట్టులోకి రానుండటంతో వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా మెరుగ్గా ఆడుతుందని ధోనీ తెలిపాడు.

కాగా, దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన చివరి, ఐదో వనే్డలో యూసుఫ్ పఠాన్ (105)ను మినహాయిస్తే, మిగతా బ్యాట్స్‌మెన్ మూకుమ్మడిగా విఫలమైన విషయం తెలిసిందే. ఫలితంగా ఈ మ్యాచ్‌నేగాక, సిరీస్‌ను కూడా భారత్ కోల్పోయింది.

వెబ్దునియా పై చదవండి