వివిధ దేశాలపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ చేసిన సెంచరీల వివరాలు!

ఆదివారం, 18 మార్చి 2012 (12:58 IST)
FILE
భారత క్రికెట్ జట్టు పరుగులు వీరుడు... "మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్" టెస్ట్ క్రికెట్ ఆడే దేశాలపైనే కాకుండా.. అన్ని క్రికెట్ దేశాలు ఆడే దేశాలపై పరుగుల వరద పారించాడు. ఈ తరుణంలో ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ వచ్చిన వందో శతకాన్ని కూడా తాజాగా సచిన్ పూర్తి చేసుకున్నాడు.

ఈ నేపథ్యంలో.. వివిధ దేశాలపై ఎన్నెన్ని సెంచరీలు చేశాడు.. వాటి వివరాలను ఇక్కడ పరిశీలిద్ధాం. ఆస్ట్రేలియా : 11 టెస్ట్ సెంటరీలు, 9 వన్డే శతకాలు. అలాగే, శ్రీలంకపై 9 టెస్ట్ సెంచరీలు, 8 వన్డే సెంచరీలు, దక్షిణాఫ్రికాపై ఏడు టెస్ట్ సెంచరీలు, 5 వన్డే సెంచరీలు, ఇంగ్లండ్‌పై 7 టెస్ట్ సెంచరీలు, 2 వన్డే శతకాలు చేశాడు.

అలాగే, న్యూజిలాండ్‌పై 4 టెస్ట్ సెంచరీలు, 5 వన్డే సెంచరీలు, జింబాబేపై 3 టెస్ట్ సెంచరీలు, 5 వన్డే సెంచరీలు, వెస్టిండీస్‌పై 3 టెస్ట్ సెంచరీలు, 4 వన్డే సెంచరీలు, పాకిస్థాన్ 2 టెస్ట్ సెంచరీలు, 5 వన్డే సెంచరీలు, బంగ్లాదేశ్‌పై 5 టెస్ట్ సెంచరీలు, వన్డే శతకాలు, కెన్యాపై నాలుగు వన్డే సెంచరీలు చేయగా, నమీబియాపై ఒకే ఒక వన్డే సెంచరీ చేశాడు. మొత్తంగా 49 టెస్ట్ సెంచరీలు, 51 వన్డే సెంచరీలు తన క్రికెట్ కెరీర్‌లో ఉన్నాయి. ఇందులో 188 టెస్టులు, 462 వన్డేలను కలుపుకుని మొత్తం 650 మ్యాచ్‌లను ఆడి వంద సెంచరీలు పూర్తి చేశాడు.

News Summary : As the batting maestro scores the much-awaited hundredth ton, here is a list of Test and ODI centuries scored by Tendulkar against all teams.

వెబ్దునియా పై చదవండి