స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

సెల్వి

శనివారం, 18 మే 2024 (10:13 IST)
Swati Maliwal
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడు వైభవ్ కుమార్ తనపై దాడిచేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన సహాయకుడు వైభవ్ కుమార్ తనపై దాడిచేశారని ఆరోపించిన ఆమె.. తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
వైభవ్ తనను ఏడెనిమిదిసార్లు ముఖంపై కొట్టాడని, గుండెల్లో గుద్దాడని, కడుపులో తన్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. చాతీపై గుద్దాడు. పొత్తికడుపులో తన్నాడు. ముఖంపై కొట్టాడు. సాయం కోసం బతిమాలినా ఎవరూ రాలేదు. 
 
అతడి నుంచి తప్పించుకుని బయటికి వెళ్లినా తన బట్టలను పట్టి లాగి మరీ మళ్లీ దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు