హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ తన సత్తా ఏంటో నిరూపించుకుంటుంది. హాంకాంగ్ విజయంతో సీజన్‌కు ముగింపు పలకాలన్న లక్ష్యంతో ఈ టోర్నీ బరిలోకి దిగిన వరల్డ్ నెంబర్ టూ సైనా నెహ్వాల్, హాంకాంగ్ సూపర్ సిరీస్‌లో తన హవాను కొనసాగిస్తోంది.
క్వార్టర్ ఫైనల్లో ప్రత్యర్థిని మట్టికరిపించిన సైనా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్‌ఫైనల్లో సైనా 21-11, 21- 10తో స్థానిక స్టార్ షట్లర్ పూ ఇన్ ఇప్‌పై నెగ్గి ఆసియాడ్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.
ఆద్యంతం మెరుగైన ఆటతీరును ప్రదర్శించిన సైనా నెహ్వాల్ కేవలం 27 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. కాగా ఫైనల్ బెర్త్ కోసం సైనా జర్మనీ షట్లర్, ఆరోసీడ్ జులియన్ షెంక్‌తో సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. ఒకవేళ జులియన్‌ను ఓడిస్తే టైటిల్‌పోరులో సైనా చైనాకు చెందిన టాప్‌సీడ్ గ్జిన్ వాంగ్ లేదా మూడోసీడ్ షిజియాన్ వాంగ్‌తో పోటీపడాల్సి ఉంటుంది.