కావలసిన పదార్థాలు : వంకాయలు... అర కేజీ పంచదార... పావు కేజీ బాదంపప్పు... వంద గ్రా. వరిపిండి... 20 గ్రా. నెయ్యి... పావు కేజీ యాలక్కాయలు... 5 గ్రా. మిఠాయి రంగు... చిటికెడు పాలు... పావు కప్పు
తయారీ విధానం : వంకాయలను ఉడికించి తొక్క ఒలిచి, గింజలు తీసేసి పక్కన ఉంచాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి వేడయ్యాక నెయ్యివేసి కరిగించాలి. అందులోనే వరిపిండి వేసి కొద్దిగా రంగు మారేదాకా వేయించాలి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని వేసి, మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి.
ఆ తరువాత అందులోనే పంచదార వేసి మరికాసేపు ఉడికించి మిఠాయి రంగు కలిపిన పాలు పోసి, యాలక్కాయలపొడి కలిపి చిక్కబడేదాకా ఉడికించాలి. చివరగా, ఈ మిశ్రమంలో ముక్కలుగా కోసిన బాదంపప్పును పైన వేసి అలంకరిస్తే నోరూరించే వంకాయ బాదం హల్వా రెడీ అయినట్లే...!