దేశ రాజకీయాల్లో కీలక పాత్ర.. నెల రోజుల్లో గుణాత్మక మార్పు.. కేసీఆర్

మంగళవారం, 11 డిశెంబరు 2018 (17:28 IST)
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశానికి తెలంగాణ దిక్చూచి అవుతుందని చెప్పారు. త్వరలో తామేంటో చూపిస్తామని... దేశంలో నెల రోజుల్లో గుణాత్మక మార్పు చూస్తారని కేసీఆర్ చెప్పారు. దేశంలో రైతులను పట్టించుకునే వారు లేరన్నారు. నాలుగు పార్టీలను ఏకం చేయడం రాజకీయం కాదని.. ప్రజలను ఏకం చేయాలని కేసీఆర్ తెలిపారు. 
 
తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. చైతన్యవంతమైన గడ్డ కాబట్టి దేశ రాజకీయాల్లో కూడా ప్రాతినిధ్యం వహించాలి. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు నాయకులు కాదని... ప్రజలన్నారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రులు, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులందరూ వచ్చి ప్రచారం చేశారు. కానీ ప్రజలదే అంతిమ తీర్పు అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 
 
ఎన్నికల ఫలితాల సందర్భంగా కేంద్ర ప్రముఖులు మమతా బెనర్జీ, సీఎం నితీశ్ కుమార్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంగా దేశంలో ఓ అనిశ్చితి ఉంది. ఇది మారాలి. దేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాలు రావాలి. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ సహకారం లేకుండా అధికారంలోకి వచ్చాం. తమకు ప్రజలే బాస్‌లు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తామని కేసీఆర్ తేల్చి చెప్పారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి ఆయా పార్టీల నేతలను కలుస్తానని చెప్పారు. కొన్ని పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని కేసీఆర్ మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు