తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అధికార తెరాస స్పష్టమైన మెజార్టీతో గెలుపు దిశగా సాగుతోంది. అలాగే, సిద్ధిపేటలో ఆ పార్టీ సీనియర్ నేత టి. హరీశ్ రావు మరోమారు విజయకేతనం ఎగురవేశారు. ఆయన లక్షా 19 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈయన సమీప ప్రత్యర్థి, తెజసకు చెందిన మరికంటి భవానీ రెడ్డిపై 1,19,622 ఓట్ల తేడాతో విజయదుందుభి మోగించారు.
2004 ఉపఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యే అయిన హరీశ్‌రావు తర్వాత వరుస విజయాలు సాధిస్తున్నారు. 2008, 2010 ఉపఎన్నికలతోపాటు 2004, 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన గెలుస్తూ వచ్చారు. తాజా ఎన్నికల్లో గెలుపుతో డబుల్ హ్యాట్రిక్ సాధించినట్లైంది. 2004లో చార్మినార్ ఎంఐఎం అభ్యర్థికి లక్షా 7 వేల మెజార్టీ వచ్చింది. అలాగే, 1998 ఎన్నికల్లో గొట్టిపాటి నర్సయ్యకు 1.4 లక్షల మెజార్టీ వచ్చింది.