Cardiac Arrest: 170 కిలోల బరువు.. తగ్గుదామని జిమ్‌కు వెళ్లాడు.. గుండెపోటుతో మృతి (video)

సెల్వి

గురువారం, 3 జులై 2025 (11:07 IST)
Gym
గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతుందనే చెప్పాలి. తాజాదా బరువు తగ్గడానికి జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
హైదరాబాద్ హరిఫరీదాబాద్‌లోని బల్లాభ్‌గఢ్‌ సెక్టార్‌-9లోని ఓ జిమ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. రాజానహర్‌సింగ్‌ కాలనీకి చెందిన పంకజ్‌ శర్మ (37) దాదాపు 170 కిలోల బరువున్నాడు. బరువు తగ్గేందుకు నాలుగు నెలల క్రితం జిమ్‌లో చేరాడు. 
 
వర్కౌట్‌ ప్రారంభించడానికి ముందు బ్లాక్‌ టీ తాగి పుల్అప్స్‌ చేశాడు. అయితే ఒక్కసారికి కుప్పకూలిపోయాడు. దీన్ని గమనించిన అతడి స్నేహితులు పంకజ్‌కు నీళ్లు తాగించే ప్రయత్నం చేయడంతో పాటు రెండుసార్లు సీపీఆర్‌ కూడా చేశారు. కానీ పంకజ్‌ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

బరువు తగ్గడానికి జిమ్‌లో వర్కౌట్.. అకస్మాత్తుగా గుండెపోటు

హరిఫరీదాబాద్‌లోని బల్లాభ్‌గఢ్‌ సెక్టార్‌-9లోని ఓ జిమ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజానహర్‌సింగ్‌ కాలనీకి చెందిన పంకజ్‌ శర్మ (37) దాదాపు 170 కిలోల బరువున్నాడు. బరువు తగ్గేందుకు నాలుగు నెలల క్రితం జిమ్‌లో చేరాడు. వర్కౌట్… pic.twitter.com/ikACq3QqqA

— ChotaNews App (@ChotaNewsApp) July 3, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు