నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోనూ పలు మండలాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 డిగ్రీల లోపే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించారు.
ఇదిలావుంటే, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట వద్ద జరిగిన కారును లారీ ఢీ కొనడంతో నలుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగింది. సంఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. మృతులను ఏటూరునాగారం ప్రాంతానికి చెందిన కాంతయ్య, శంకర్, భారత్, చందనగా గుర్తించారు.
బాధితులు కుటుంబసభ్యులతో కలిసి వేములవాడ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు వివరించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.