ఫీలింగ్స్ సాంగ్ చేయడం రష్మికకు ఏమాత్రం ఇష్టం లేదు : సీపీఐ నారాయణ

ఠాగూర్

గురువారం, 26 డిశెంబరు 2024 (17:37 IST)
అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప-2' చిత్రంలోని ఫీలింగ్స్ పాటలో నృత్యం చేసేందుకు హీరోయిన్ రష్మికకు ఏమాత్రం ఇష్టం లేదని, దర్శకుడు ఒత్తిడి మేరకే ఆమె చేసిందని సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు కె.నారాయణ అన్నారు. ఈ చిత్రంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
'పీలింగ్స్' పాటకు డ్యాన్స్ చేయడం రష్మిక మందన్నకు ఇష్టం లేదన్నారు. డైరెక్టర్ చెప్పడం వల్లే ఆమె డ్యాన్స్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. సినీ పరిశ్రమలో ఎంతో మంది మహిళలు ఆత్మాభిమానాన్ని చంపుకుని పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
'పుష్ప-2' సినిమాపై కూడా నారాయణ విమర్శలు గుప్పించారు. క్రైమ్, అశ్లీలత ఉన్న సినిమాలకు ప్రభుత్వాలు ఎందుకు రాయితీలు ఇస్తున్నాయని ప్రశ్నించారు. ఒక ఎర్రచందనం దొంగను హీరోగా చూపించారని మండిపడ్డారు. రూ.100 టికెట్‌ను రూ.1,000 చేయడం ఎందుకని ప్రశ్నించారు. సినిమా హీరోలు రోడ్ షోలు చేయడం ఎందుకని అడిగారు. 
 
పుష్ప-2 ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా హీరో అల్లు అర్జున్ రోడ్డు షో చేయడం వల్లే ఓ మహిళా అభిమాని ప్రాణాలు కోల్పోయిందని, మరో పసిప్రాణం కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడని ఆయన గుర్తు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు