హైదరాబాదులో కో-లివింగ్ కల్చర్ పెరిగింది. ఒకే హాస్టల్, ఒకే గదిలో అమ్మాయిలు, అబ్బాయిలు ఉండొచ్చు. హైదరాబాదులోని ఐటీ ప్రాంతాల్లో పీజీ హాస్టళ్లు కూడా వెలిశాయి. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇద్దరు మేజర్లు కలిసి ఉండడంలో లీగల్గా ఎలాంటి తప్పులేదని చెబుతున్నా.. ఈ కో లివింగ్ రిలేషన్స్ ద్వారా దుర్వినియోగం, నేరాలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి.