డాక్టరైనా నాకీ గతి పడుతుందని అనుకోలేదు మమ్మీ: లేడీ డాక్టర్ ఆత్మహత్య యత్నం (Video)

ఐవీఆర్

మంగళవారం, 28 జనవరి 2025 (22:32 IST)
తను వైద్యురాలినైనా ఈ గతి పడుతుందని అసలు అనుకోలేదు మమ్మీ... నా భర్త, అత్తమామలు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాననీ మమ్మీ అంటూ ప్రణీత అనే వైద్యురాలు సెల్ఫీ వీడియో ద్వారా చెబుతూ ఆత్మహత్య యత్నం చేసారు. సెల్ఫీ వీడియోలు తను భరిస్తున్న వేధింపులను వెల్లడించారు.
 
ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ... నావల్ల మీకు ఎన్నో అవమానాలు ఎదురవుతున్నాయి. నన్ను క్షమించండి. నన్ను వేధిస్తున్నారు. నాకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు. ఈ వేధింపులు భరించలేకపోతున్నా. నా వల్ల కావడంలేదు. చనిపోవాలనుకుంటున్నా. దయచేసి నన్ను క్షమించు మమ్మీ. నేను పోయాక మీకు ప్రశాంతత లభిస్తుందని అనుకుంటున్నా. నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి. మా అత్తమామలకు అప్పజెప్పవద్దు. డాక్టర్ నైన నాకు ఈ గతి పడుతుందని అనుకోలేదు మమ్మీ. సారీ మమ్మీ" అంటూ వైద్యురాలు ప్రణీత కన్నీటిపర్యంతమయ్యారు. కాగా బాధితురాలిని కర్మన్ ఘట్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

భర్త, అత్తమామల వేధింపులు భరించలేక, సెల్ఫీ వీడియో తీసుకొని డాక్టర్ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌లో భర్త, అత్తమామల వేధింపుల కారణంగా ప్రణీత అనే మహిళా డాక్టర్ ఆత్మహత్యాయత్నం

సెల్ఫీ వీడియోలో వేధింపుల గురించి ప్రస్థావిస్తూ కన్నీటి పర్యంతమై, ఆత్మహత్యాయత్నం చేసుకున్న ప్రణిత

కర్మన్ ఘట్ -… pic.twitter.com/bI5igY4L7R

— Telugu Scribe (@TeluguScribe) January 28, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు