బఫర్ జోన్లో నిబంధనలకు విరుద్ధంగా అనేక అనుమతులను ఇచ్చిన నిఖేష్ అందుకు ప్రతిఫలంగా భారీగా ముడుపులు పుచ్చుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అందినకాడికి అక్రమార్జన చేసినట్లు తేలింది. ఏసీబి సోదాల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించారు. 5 ప్లాట్లు, ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి, ఆరు ఓపెన్ ఫ్లాట్స్, రెండు కమర్షియల్ స్పేసుకి సంబంధించి డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ. 200 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లు చెబుతున్నారు.