ఈ సందర్భంగా రూ.50 లక్షల కట్నం, ఇతర లాంఛనాలు అందుకున్నాడు. నాలుగేళ్ల పాటు ఒక్క పైసా కూడా తేకపోవడంతో అనుమానించిన భార్య డబ్బులేం చేస్తున్నావని నిలదీస్తే.. తాను రూ.40 కోట్లు సంపాదించానని, అయితే ఐటీ కట్టకపోవడంతో అధికారులు ఆ మొత్తాన్ని సీజ్ చేశారని చెప్పాడు. రూ. 2 కోట్లు కావాలని చెప్పడంతో ఆమె ఏదో రకంగా సమకూర్చింది.
ఈ క్రమంలో అనుమానం వచ్చిన శ్రావణి భర్త ధ్రువీకరణ పత్రాలు పరిశీలించగా అవి నకిలీవని తేలింది. దీంతో ఆమె బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సందీప్‌తోపాటు అతడి తల్లిదండ్రులను అరెస్ట్ చేసి, నిన్న కోర్టులో ప్రవేశపెట్టారు.