సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య!!

ఠాగూర్

ఆదివారం, 7 ఏప్రియల్ 2024 (12:58 IST)
హైదరాబాద్ నగరంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ బలవంతంగా తనువు చాలించాడు. తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలో కబూతర్ ఖానా పరిధిలో జరిగింది. పాతబస్తీలోని హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కబూతర్ ఖానా పోలీస్ పికెటింగ్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మృతుడిని తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బాలేశ్వర్‌గా గుర్తించారు. 
 
1995 బ్యాచ్‌కు చెందిన బాలేశ్వర్ టీఎస్‌ఎస్పీలో 10వ బెటాలియన్‌లో పనిచేస్తున్నాడు. మొత్తం రెండు రౌండ్లు ఫైర్ జరిగినట్టు పోలీసులు తెలిపారు. అయితే, ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. బాలేశ్వర్ ఉద్దేశపూర్వకంగానే సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడా లేదా తుపాకీ మిస్ ఫైర్ అయిందా అనే అంశంపై ఆరా తీస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు