మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రెండో పట్టణ ఠాణా సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో ప్రతిభా జూనియర్ కళాశాలకు చెందిన బస్సు కొంతమంది విద్యార్థులతో కళాశాలకు వస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఎదురుగా రహదారిపై మలుపు తిరుగుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది.