దేశ వ్యాప్తంగా చిక్కెన్ ధరలు మండిపోతున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో వీటి ధరలు మరింతగా మండిపోతున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి నగరాల్లో కేజీ చికెన్ ధర రూ.220 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. దీంతో సామాన్య ప్రజలు చికెన్ అంటే భయపడిపోయే పరిస్థితి ఉత్పన్నమైంది.
అయితే, గత కొన్ని రోజులుగా ఈ చికెన్ ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఫలితంగా కేజీ చికెన్ ధర రూ.220 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. చెన్నై, బెంగుళూరు వంటి నగరాల్లో కూడా ఈ ధరలు ఇదేవిధంగా ఉన్నాయి. చెన్నైలో కేజీ చికెన్ ధర రూ.240 పలుకుతోంది. దీనికి ప్రధాన కారణం లేకపోలేదు.
కరోనా వైరస్‌ను ఎదుర్కోవాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తుండడంతో ప్రజలు చికెన్ తినాలని అనుకుంటున్నారు. అయితే, ధరలు పెరిగిపోతుండడంతో సామాన్యుడు చికెన్ కొనలేకపోతున్నాడు.