వంద ఎకరాల్లో నేను, నా కొడుకు బాజప్తాగా వ్యవసాయం చేసుకుంటున్నాం. మాకేం మనీలాండరింగ్‌లు, బొండరింగ్‌లు లేవు. మాకేం కంపెనీలు లేవు.. దందాలు లేవు. మాకేం బిజినెస్‌లు లేవు. దొంగ వ్యాపారాల్లేవు. మీరు మమ్మల్ని ఏం చేయలేరు. మేం నిజాయితిగా ఉన్నాం.. నిఖార్సుగా ఉన్నాం. ఎవరితోనైనా పోరాడుతాం. ఎవరికీ భయపడం అంటూ బండిపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు.
ఈ రాష్ట్రం కోసం కట్టిన ప్రాజెక్టుల్లో మా అత్తగారి పొలం, మా పొలంతో పాటు ఊర్లన్నీ మునిగిపోయాయి. మేం దొంగ సొమ్ముతో బతకం. అందుకే మేం దేనికి భయపడం. నా హద్దులను నిర్ణయించడానికి నీవు ఎవరు? అంటూ తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు
ఇప్పటికైనా మా ప్రాణం పోయే వరకు తెలంగాణ కోసం, రైతుల ప్రయోజనాల కోసం కొట్లాడుతాం. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనే వరకు పోరాడుతాం. మీరు వడ్లు కొనం అంటే మీకు ఓటేయ్యాలా? వద్దా? అనేది ప్రజలు నిర్ణయించుకుంటారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.