రెండేళ్ళు లాడ్జిలో నర్సుతో కానిస్టేబుల్ రాసలీలలు, గర్భం దాలిస్తే చివరకు?

గురువారం, 13 ఫిబ్రవరి 2020 (15:37 IST)
అమాయక యువతిని ప్రేమించినట్లు నటించి పెళ్ళి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసిన కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులు వేటు వేశారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ విభాగం ఎనిమిదో బెటాలియన్‌కు చెందిన పల్లె గురువయ్యకు రెండేళ్ల క్రితం నగరంలో నర్సింగ్‌ కోర్సు చదువుతున్న యువతితో పరిచయమైంది. కొద్దిరోజుల్లో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
అయితే గురవయ్యకు ఇటీవల ఇంట్లో వాళ్లు మరో యువతిని వివాహం నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న యువతి ప్రియుడిని నిలదీయగా కలిసి తిరిగాం.. ఎంజాయ్ చేశాం.. ఇప్పుడు ఎవరిదారి వారు చూసుకుందాం అన్నాడు. దీంతో ఖంగుతిన్న బాధితురాలు వధువు తరుపు వారికి విషయం చెప్పి పెళ్లి ఆపివేయించింది. తనను మోసం చేసిన గురవయ్యపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
గురవయ్య తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పంజాగుట్టలోని డెక్కన్ లాడ్జికి తీసుకెళ్లి పలుమార్లు లైంగికంగా అనుభవించాడని, గర్భం దాలిస్తే మాత్రలు మింగించి అబార్షన్ చేయించాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు