రహస్యంగా ప్రేమ వివాహం, పెద్దల ఆశీర్వాదాల కోసం వస్తుండగా...

శనివారం, 12 డిశెంబరు 2020 (13:19 IST)
వారిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం పెద్దలకు చెబితే అంగీకరించరేమోనని రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దల ఆశీర్వాదాల కోసం స్వస్థలానికి బయలుదేరారు. ఐతే ఇంతలోనే వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.
 
వివరాల్లోకి వెళితే... కామారెడ్డి జిల్లా స‌దాశివ‌న‌గ‌ర్ మండ‌లం మోడెగాం గ్రామానికి చెందిన 24 ఏళ్ల బ‌ట్టు స‌తీశ్, హైద‌రాబాద్‌లోని గండి మైస‌మ్మ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల మ‌హిమ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సతీశ్ హైదరాబాదులోని ఓ హోటల్లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి మహిమతో పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. విషయాన్ని పెద్దలకు చెబితే అంగీకరించరని రహస్యంగా వివాహం చేసుకున్నారు.
 
ఈ విషయాన్ని పెద్దలకు చెప్పి ఆశీర్వాదాలు తీసుకుందామని బైక్ పైన వస్తుండగా సదాశివనగర్ మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. దీనితో మహిమ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది. సతీశ్ ఆసుపత్రిలో చనిపోయాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు