బస్తీమే సవాల్ : నా గురించి మాట్లాడే అర్హత హరీష్‌కు లేదు.. ఈటల

గురువారం, 12 ఆగస్టు 2021 (15:40 IST)
మాజీ మంత్రి, తెరాస మాజీ నేత ఈటల రాజేందర్ బహిరంగ సవాల్ విసిరారు. తెరాస సీనియర్ నేత, మంత్రి, ఆ పార్టీ కీలక నేత అయిన మంత్రి హరీష్ రావుకు ఈ ఛాలెంజ్ విసిరారు. తన గురించి అబద్ధపు మాటలు చెప్పి హుజూరాబాద్ ప్రజలను నమ్మించే ప్రయత్నాన్ని హరీశ్ చేశారని మండిపడ్డారు. హరీశ్ వి మోసపు మాటలనే విషయం ఇక్కడి ప్రజలకు తెలుసని... ఇక్కడి ప్రజల ప్రేమను పొంది, వరుసగా గెలుస్తున్న వ్యక్తిని తానని చెప్పారు.
 
తెరాసలో చేరడానికి ముందు తనకున్న ఆస్తులు, ఇప్పుడున్న ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని అన్నారు. 2001లో హరీశ్ రావుకు ఉన్న ఆస్తులు, ఇప్పుడు ఉన్న ఆస్తులపై విచారణకు ఆయన సిద్ధమా? అని బహిరంగంగా సవాల్ విసిరారు. ఈ విషయంపై అబిడ్స్‌లో బహిరంగ చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు.
 
ఎమ్మెల్యేకాకుండానే మంత్రి అయిన హరీశ్‌కు తన గురించి మాట్లాడే అర్హత కూడా లేదని ఈటల మండిపడ్డారు. హుజూరాబాద్‌లో ఈటల తప్పుడు ప్రచారం చేస్తున్నారని... దుబ్బాక ఎన్నికలో కూడా ఇలాంటి మోసపూరిత మాటలు చెప్పిన హరీశ్‌కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని ఈటల చురకలంటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు