హుజురాబాద్ పోటీలో తాను కూడా ఉన్నట్లు జమున వ్యాఖ్యానించారు. అయితే, ఎవరు పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తన భర్త పోటీ చేసినా, తాను పోటీ చేసినా ఒక్కటేనని చెప్పారు.
తెలంగాణ ఉద్యమం సమయంలోనూ తాను తన భర్త ఈటలను వెనకుండి నడిపించానని ఆమె తెలిపారు. అలాగే, ప్రతి ఎన్నికల్లో ఈటల ముందుండి ప్రచారం చేశానని అన్నారు. తమ ఇద్దరిలో ఎవరికి అవకాశం వస్తే వాళ్లం పోటీ చేస్తామని చెప్పారు.