ఇందులో ఆమె మాట్లాడుతూ, తన శరీర రంగును పలువురు పదేపదే విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన రంగు నలుపు అని తన నుదురు బట్టలలగా ఉంటుందని కొందరు హేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుపు అంటూ మరోమారు తనను విమర్శిస్తే అగ్గిలా మారుతానని హెచ్చరించారు. విమర్శలను పట్టించుకోబోనన్నారు. అదేసమయంలో వారు ఓర్వలేని స్థాయికి చేరుకుంటానని చెప్పారు.
కాగా, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాలకు గవర్నరుగా వ్యవహరిస్తున్న డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్.. తెలంగాణాలోని సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహిరంచే తెరాస ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాపిస్తున్నారు. ఈ విషయంలో తనను విమర్శిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు.