నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీలకు సంబంధించిన ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. మరోవైపు, వ్యవసాయ ఆస్తుల నమోదులో ఆధార్ వివరాల కోసం ఒత్తిడి చేయవద్దనని పేర్కొంది.
ఏ చట్టం ప్రకారం ఆధార్, కులం వివరాలు సేకరిస్తున్నారని ప్రశ్నించిన హైకోర్టు.. కొత్త రెవెన్యూ చట్టం వ్యవసాయ భూములకు సంబంధించింది మాత్రమేనని.. కొత్త రెవెన్యూ చట్టంలో వ్యవసాయేతర భూముల ప్రస్తావన ఎక్కడుంది?..
అయితే, డేటా భద్రతకు అన్ని చర్యలు తీసుకున్నట్లు హైకోర్టుకు తెలిపారు అడ్వొకేట్ జనరల్.. కౌంటర్ దాఖలుకు రెండు వారాల గడువు కోరారు. చట్టబద్ధత, డేటా భద్రతపై పూర్తి వివరాలు సమర్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది.