శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ఆదివారం, 30 ఆగస్టు 2020 (20:05 IST)
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు.

దర్శనార్థం వచ్చిన ఆయనకు ఆలయ మహాద్వారం వద్ద దేవస్థానం ఈవో రామారావు, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ మహేశ్వరి... స్వామి, అమ్మవార్ల మహామంగళహరతి సేవలో పాల్గొన్నారు. 
 
అక్కడి నుంచి శ్రీశైలం జలాశయం వద్దకు చేరుకున్నారు. దృష్టి కేంద్రం వద్ద నుంచి జలాశయాన్ని వీక్షించారు. అక్కడే ఉన్న మ్యూజియంలోకి వెళ్లి శ్రీశైలం జలాశయ నిర్మాణ నమూనాను పరిశీలించారు. 
 
శ్రీశైలం ఆనకట్ట నిర్మాణం వివరాలను జలవనరుల శాఖ ఇంజనీర్లు.. ఆయనకు వివరించారు. సీజే వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ రవి పఠాన్ శెట్టి, జిల్లా జడ్జి రాధాకృష్ణ కృపా సాగర్ ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు