తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, లాలాపేటలో నివాసముంటున్న 19 యేళ్ళ యువతి.. బర్కత్‌పురలోని ఓ ఆస్పత్రిలో ఆయాగా పనిచేస్తుంది. అదే ఆస్పత్రిలో పీర్జాదిగూడకు చెందిన రవి (40) అనే వ్యక్తి వండ మనిషిగా పని చేస్తున్నాడు.
అయితే, ఆ యువతిపై కన్నేసిన రవి.. ఆమెకు బత్తాయి జ్యూస్‌లో మత్తుమందు కలిపిన జ్యూస్ ఇచ్చాడు. అది సేవించిన ఆ యువతి అపస్మారకస్థితిలోకి జారుకోవడంతో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇలా పలుమార్లు చేశారు. ఈ క్రమంలో ఆ యువతి గర్భందాల్చడంతో శరీరంలో మార్పులు సంభవించాయి.