ఆషాఢంలో చుక్కల అమావాస్య, పెళ్లికాని కన్నెలు పూజిస్తే?

గురువారం, 25 జూన్ 2020 (19:49 IST)
ఆషాఢ బహుళ అమావాస్యను చుక్కల అమావాస్య అని, వాజసనేయి అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజున చౌడేశ్వరీ దేవతను ఆరాధించాలి. దక్షిణాయనములో మెుదటి అమావాస్య కనుక దీపములను అధిక సంఖ్యలో వెలిగించి శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం మంగళప్రదమని ధర్మ శాస్త్రాలు చెప్పుచున్నాయి.
 
అంతేకాదు ఇలా దీప ప్రజ్జ్వలనము చేయడం వలన పితృదేవతలు సంతోషించి వారి ఆశీస్సులు మనకు అందిస్తారు. కొన్ని ప్రాంతాలలో అయితే గౌరివ్రతమాచిరిస్తారు. గౌరి దేవిని షోడశోపచార పూజలుచేసి కుడుములు నైవేద్యంగా పెట్టాలి. పూజ చేసే ముందే రెండు రక్షలను తయారుచేసి ఒకటి అమ్మవారికి సమర్పించి, మరొకటి చేతికి ధరించాలి.
 
కన్యలు ఈ వ్రతమాచరిస్తే మంచి వరుడుతో వివాహం జరుగుతుంది. వివాహితులు ఆచరించిన సౌభాగ్యప్రదం, పుణ్యలోకప్రాప్తి, మానవజన్మ ఉద్దరించ బడుతుంది. అషాఢంలో ఆధ్యాత్మిక చింతన సర్వ ఫలదాయకం, ముక్తిదాయకం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు