సంగారెడ్డి జిల్లాకు చెందిన ఉదయ, జగద్గిరిగుట్టకు చెందిన సురేష్‌లకు ఐదేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ళ కుమారుడు ఉన్నాడు. జగద్గిరిగుట్ట లోనే వీరు నివాసముండేవారు. కర్ణాటకకు చెందిన భాస్కర్ అనే వ్యక్తి సురేష్‌కు పరిచయమయ్యాడు. ఆ పరిచయం సురేష్ భార్యతో అక్రమ సంబంధానికి దారితీసింది.
సురేష్ పనిమీద బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చే భాస్కర్, ఉదయతో ఎంజాయ్ చేసేవాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అసలు విషయం సురేష్‌కు తెలిసింది. భార్యను నిలదీశాడు. అయితే తాను ప్రియుడితోనే ఉంటానని తేల్చేసింది. భర్త ముఖం మీదే చెప్పేసింది.