అప్పటి నుంచి తాను ఇళ్లును అమ్మనని, ఇచ్చిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వనని యజమాని గొడవకు దిగాడు. ఈ నేపథ్యంలో శనివారం వినోద్ ఇంటి యజమానిని నిలదీయగా ఇంటి యజమానితో పాటు అతని భార్య, కొడుకులు వినోద్‌పై దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో వినోద్ తలకు తీవ్రగాయాలు అయ్యాయి. దాడికి దిగిన వారిపై కాచిగూడ పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.