వద్దన్నా వెంటపడ్డాడు. పెళ్ళి చేసుకుంటానని ప్రేమలోకి దింపాడు. మోసం చేసి దేశం వదిలి వెళ్ళాడు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటారు. కానీ అది నిజం కాదు. కొందరి మగవారి మాటలకు అర్థాలే వేరులే అని చెప్పాల్సి వస్తోంది. ప్రేమ, పెళ్ళి అనే పదాలకు అర్థాలనే మార్చేస్తున్నారు.
ఈ రెండు మాటలు చెప్పి అమ్మాయిల జీవితాలో ఆడుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో అదే జరిగింది. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయిన అమ్మాయి, మేనమామ ఇంటిలో ఉంటూ కష్టపడి బి.టెక్ వరకు చదువుకుంది. తన స్వశక్తితో లెక్చరర్ ఉద్యోగం తెచ్చుకుంది.
ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు ఇచ్చినప్పుడల్లా నల్గొండకు రావడం మౌనిక వెనుక తిరగడం. ఇదే అతని పనిగా మారిపోయింది. పెళ్ళిచేసుకుంటానని నమ్మించాడు. ప్రశాంతంగా సాగుతున్న జీవితంలో ప్రేమ అనే పేరుతో అలజడి రేపాడు. తల్లిదండ్రులు లేని తనకు అన్నీ తానై ఉంటానని నమ్మించాడు. అలా ఆమెను లొంగదీసుకున్నాడు. లాడ్జీలకు తిప్పాడు.
శారీరక అవసరాలను తీర్చుకున్నాడు. ప్రేమించాను కానీ మావాళ్ళను ఎదిరించి పెళ్ళి చేసుకోలేనన్నాడు. కొన్నిరోజుల తరువాత మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న యువతి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆస్ట్రేలియాలో ఉన్న శివను అరెస్టు ఎలా చేస్తామని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. విషయం కాస్త గ్రామం మొత్తం తెలిసిపోయింది. దీంతో మౌనిక కన్నీరుమున్నీరవుతోంది.