గత కొన్నిరోజులుగా జిల్లాలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు దృష్టిపెట్టిన నేపధ్యంలో స్థానిక ప్రజా ప్రతినిధులను హెచ్చరిస్తూ నక్సలైట్లు లేఖ రాయడం పై ఆయా పార్టీల ప్రజా ప్రతినిధుల్లోనూ వణుకు మొదలైంది. కరీం నగర్ , ఖమ్మం, వరంగల్ ఏరియా కమిటీ పేర కరపత్రాలను ప్రత్యక్షం అయ్యాయి.
ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షులు, సర్పంచ్ బంటు రమేష్‌కు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. గత 8 సంవత్సరాల క్రితం బోర్లగూడెంలో వెంకటేశ్వరరావుకు పట్టిన గతే నలుగురికి పడుతుందని మావోలు లేఖలో హెచ్చరించారు.
ఉమ్మడి వరంగంల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ప్రజా ప్రతినిధుల ఆస్తులవివరాలను సైతం మావోలు లేఖలో పేర్కొన్నారు.