ఈ వివరాలను పరిశీలిస్తే, దీపిక అనే మహిళ మరో మహిళతో కలిసి రోడ్డుపై నడుస్తూ వెళుతుండగా, గుర్తు తెలియని దుండగులు కొందరు దీపికను బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఈ యువతి గత నాలుగేళ్ళ క్రితం అఖిల్ అనే యువకుడిని ప్రేమ పెళ్ళి చేసుకుంది. ఆ తర్వాత అతనికి దూరమైంది. సో.. అతనే కిడ్నాప్ చేసివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా, ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అందుబాటులో ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ నీ పరిశీలిస్తున్నారు. దుండగులు అనంతగిరి వైపు వెళ్లి ఉంటారని భావించి, ఆ వైపు రెస్క్యూ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.