హైదరాబాదు వాసులకు ఊరట కలిగించిన ఉల్లి ధర

శనివారం, 24 అక్టోబరు 2020 (14:33 IST)
గత కొద్ది రోజులుగా ఉల్లి ధర ఆకాశానికి ఎగబాకటంతో సామాన్య ప్రజలు కొనడానికి కంట నీరు పెట్టకున్నారు. హోల్ సేల్ మార్కెట్లో ధరలు అనుహ్యంగా పెరగడం రిటైల్ మార్కెట్లపై పెనుభారం మోపుతుంది. ఈ పెనుభారంతో సామాన్య ప్రజలు సతమవుతున్నారు. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.100 దాటింది. అయితే ఈ ఉల్లి ధరలను నియంత్రించేందుకు పలు రాష్ట్రాలు మార్కెట్ ధరలపై ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నది.
 
ఈ నేపథ్యంలో హైదరాబాదులో కిలో ఉల్లి ధర రూ.35కే విక్రయిస్తున్నట్లు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం శారు. దీంతో హైదరాబాదు నగరంలో 11 రైతు బజార్లలో ఉల్లి విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి రెండు కిలోల ఉల్లి విక్రయిస్తారని, ఏదైనా గుర్తింపు కార్డు ద్వారా ఉల్లిని రైతు బజారులో కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు.
 
భారీ వర్షల కారణంగా ఉల్లి పంట దెబ్బ తినడంలో భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. భారీ వర్ష ప్రభావంతో రానున్న రోజులలో ఉల్లి ధర మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు