అయితే, గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో మాత్రం హైదరాబాద్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించి అత్యంత కీలకమైన విజయాన్ని నమోదు చేశారు. నిజానికి కోల్‌కతాతో జరిగిన పేసర్ లూకీ ఫెర్గూసన్ ధాటికి విలవిల్లాడి సూపర్ ఓవర్‌లో హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. కానీ, గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం విజయభేరీ మోగించింది.
ఆ జట్టు బ్యాట్స్‌మెన్లు మనీశ్ పాండే 47 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 83 (నాటౌట్), విజయ్ శంకర్ 51 బంతుల్లో 6 ఫోర్లు కొట్టి 52 (నాటౌట్) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక భూమికను పోషించారు. ఫలితంగా వార్నర్ సేన ఈ సీజన్‌లో ఛేజింగ్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. సంజూ శాంసన్ 26 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో చేసిన 36 పరుగులు అత్యధిక స్కోరు కావడం గమనార్హం. మిగిలిన ఆటగాళ్లలో ఊతప్ప 19 (రనౌట్), స్టోక్ 30, బట్లర్ 9, స్మిత్ 19, పరాగ్ 20, తెవాటియా 2, అర్చర్ 16 చొప్పున పరుగులు చేశారు. ఫలితంగా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.
ఆ తర్వాత 155 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు... 18.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే కెప్టెన్ డేవిడ్ వార్నర్ (4) ఔట్‌కాగా.. మూడో ఓవర్‌లో బెయిర్‌స్టో (10) కూడా వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లు ఆర్చర్ ఖాతాలోకే వెళ్లాయి.