దసరా సందర్భంగా పల్లెవైపు ప్రయాణమౌతున్న భాగ్యనగర వాసులు

శుక్రవారం, 23 అక్టోబరు 2020 (12:55 IST)
దసరా సందర్భంగా భాగ్యనగర వాసులు తమ సొంత ఊళ్లకు ప్రయాణం కొనసాగిస్తున్నారు. దీంతో తెలంగాణ జిల్లాకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాదులోని ప్రధాన బస్టాప్‌లన్నీ రద్దీగా మారాయి. గత ఏడాదితో పోలిస్తే కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది పండుగకు వెళ్లే వారి సంఖ్య కొంత వరకు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది.
 
సికింద్రాబాద్ జూబ్లీ బస్టేషన్ దగ్గర ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. తమ సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాప్ అంతా సందడిగా కనిపిస్తోంది. మరోవైపు పండుగ సందర్భంగా 3 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆర్టీసీ కోవిడ్ నిబంధనలు ప్రకారం ప్రజలు ప్రయాణించేలా చర్యలు చేపట్టింది.
 
ప్రయాణికుల రద్దీ, అవసరాలను బట్టి మరిన్ని సర్వీసులు నడిపేందుకు బస్సులు సిద్దం చేసింది తెలంగాణ ఆర్టీసీ. ప్రయాణికులపై కోవిడ్ నిఘా పెంచడంతోపాటు అన్నీ బస్సులకు శానిటైజేషన్ చేయడం జరిగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు