రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు... పరీక్షలు వాయిదా

సోమవారం, 11 జులై 2022 (10:15 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సోమవారం నుంచి బుధవారం వరకు అన్ని రకాల విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. దీంతో కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని జరగాల్సిన పరీక్షలు వాయిదావేశారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో కాకతీయ వర్శిటీ పరిధిలో సోమ, మంగళవారాల్లో జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను అధికారులు వాయిదావేశారు.
 
పరీక్షలను మళ్ళీ ఎపుడు నిర్వహిస్తామన్ని త్వరలో వెల్లడిస్తామని రిజిస్ట్రార్ ప్రకటించారు. ఇక ఉస్మానియా యూనివర్శిటీ నేటి నుంచి మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. దీంతో సోమవారం నుంచి బుధవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసింది. ఈ నెల 14 నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథంగా ఉంటాయని అధికారులు తెలిపారు. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను వెబ్‌సైట్‌ ద్వారా ప్రకటిస్తామని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు